తెలంగాణలో కరోనా విలయం.. టెస్టుల కోసం గందరగోళం

-

హైదరాబాద్: తెలంగాణ కరోనా మహమ్మారి భయకరంగా విజృంభిస్తోంది. వందల్లో నుంచి వేలలోకి వ్యాప్తి చెందింది. దీంతో రాష్ట్రంలో ప్రజలు విపరీతంగా కరోనా బారిన పడుతున్నారు. సాధారణ జలుబు, జ్వరం లక్షణాలు కనిపించినా జనం కరోనా టెస్టులకు క్యూ కడుతున్నారు. కరోనా టెస్టుల కోసం పరీక్షా కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లు ఏర్పడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి టెస్టింగ్ కోసం బారులు తీరుతున్నారు. మరోవైపు ఆర్టీపిసిఆర్ టెస్టులు తగ్గడంతో ఆందోళన నెలకొంది. రెండు రోజులు ముందుగా టోకెన్ తీసుకుంటేనే టెస్ట్ చేయించుకునే అవకాశం ఉంటుంది. ఇక టెస్టింగ్ వచ్చే వాళ్లు భౌతిక దూరం పాటించడంలేదు. టెస్టింగ్ కోసం గుంపులు గుంపులుగా నిల్చుంటున్నారు. ఒక్కో టెస్టింగ్ కేంద్రాల్లో 100 మాత్రమే పరీక్షల చేయడంతో ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండాపూర్‌లోని రంగా రెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే చోట టెస్టింగ్, వాక్సినేషన్ చేయడంతో గందరగోళం నెలకొంది. టెస్టుంగ్ కోసం వెళ్లి వ్యాక్సిన్ లైన్లో నిలబడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version