వాటే స్కీమ్… రూ.20 లక్షలు పొందండి ఇలా …!

-

మీరు మంచిగా డబ్బులు పొందాలని అనుకుంటున్నారా…? అయితే తప్పక దీని కోసం తెలుసుకోవాలి. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ద్వారా మీరు రూ.లక్షలు వెనకేయొచ్చు. ఇందులో కనుక డబ్బులు పెడితే లాభం గ్యారంటీ. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే… స్మాల్ సేవింగ్స్ స్కీమ్ పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF కూడా ఒకటి. ఇక మరి ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం..!

దీని కోసం మీరు ప్రతి నెలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కోసం మీరు రోజుకు రూ.150 ఆదా చేస్తే.. రూ.20 లక్షలు వరకుపొందొచ్చు. అయితే మీరు ఇందులో 20 ఏళ్లు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది.

రూ.100 లేదా రూ.150 ఆదా చేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే సూపర్ ప్రాఫిట్ ని మీరు పొందవచ్చు. దీనితో మీకు దీర్ఘకాలంలో అదనపు రాబడి లభిస్తుందని చెప్పొచ్చు. ఈ స్కీమ్ లో మీరు రోజుకు రూ.100 నుంచి రూ.150 ఆదా చేసి….

20 ఏళ్లు వరకు ఇన్వెస్ట్ చేస్తే రూ.20 లక్షలు వస్తాయని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు అంటున్నారు. ఇలా ఏడాదికి రూ.54 వేలు ఈ స్కీమ్ లో పెడుతుంటే 20 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే రనూ.10.8 లక్షలు అవుతాయి.

7.1 శాతం వడ్డీ ప్రాతిపదికన చూస్తే మీకు 20 ఏళ్ల మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ.20 లక్షలకు పైగా వస్తాయి. ఈ ఎకౌంట్ ని రూ.100తో కూడా ఓపెన్ చెయ్యచ్చు. పైగా పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి

Read more RELATED
Recommended to you

Exit mobile version