1100 కేంద్రాల్లో కరోనా పరీక్షలు.. స్పష్టం చేసిన ఈటెల..?

-

కోఠి కమాండ్ కంట్రోల్ రూమ్ లో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ ను తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం కరోనా పరీక్షలు చేసే సంచార వాహనాన్ని కూడా ప్రారంభించారు ఈటెల. మొబైల్ యాప్ ద్వారా శరవేగంగా కరోనా పరీక్షలు చేసే అవకాశం ఉంది అంటూ తెలిపారు. ఒకేసారి పది మంది నమూనాలను తీసుకునే అవకాశం ఉందని తెలిపిన మంత్రి ఈటల… రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 1100 కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

హిత్ అనే యాప్ ద్వారా కరోనా రోగుల వివరాలు నమోదు చేస్తామంటూ తెలిపిన ఈటల రాజేందర్.. కరోనా లక్షణాలు లేనివారు ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉండాలని… ఇంట్లో సౌకర్యం లేక పోతే ప్రభుత్వ పర్యవేక్షణలో చికిత్స అందిస్తాము అంటూ స్పష్టం చేశారు. ముఖ్యంగా కంటోన్మెంట్ జోన్లలో పరీక్షల కోసం ఈ సంచార వాహనాలను పంపిస్తామని తెలిపారు. కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తుల నమూనాలను సేకరిస్తున్నామన్న ఈటెల.. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version