ఉద్యోగులకు కరోనా: అధికారులపై జగన్ సీరియస్

-

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కేసులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగుల ద్వారా ఇప్పుడు కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని ఎక్కడా తగ్గడం లేదు. ఇక నేడు కూడా మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన కొందరు ఉద్యోగులకు కరోనా వచ్చింది.

అతనితో సన్నిహితంగా ఉద్యోగులు అందరిని క్వారంటైన్ చేసారు. ఇక ఆ తర్వాత సచివాలయంలో 2,3 బ్లాకుల్లో పని చేసే ఉద్యోగులకు కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీనితో అధికారులు అప్రమత్తమై సచివాలయంలో అన్ని గదులను శానిటేషన్ చేయడమే కాకుండా అందరికి కూడా పరిక్షలు నిర్వహించారు. దాదాపు నాలుగు రోజుల పాటు ఈ కరోనా పరిక్షలు నిర్వహించారు ఏపీ వైద్య శాఖ అధికారులు.

ఇక ఇప్పుడు మరోసారి కరోనా కేసు బయటపడింది. సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖలోని ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒకటవ బ్లాక్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఉద్యోగికి కరోనా సోకింది. వ్యవసాయ శాఖలో పనిచేసే ఉద్యోగికి కూడా పాజిటివ్ వచ్చింది. ఇక సచివాలయంలో కరోనా కేసులు పెరగడంపై సిఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉద్యోగులను కుదిరితే వర్క్ ఫ్రం హోం చేయించాలి అని ఆయన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version