ప్రియమణి కి షాకిచ్చిన నారప్ప టీం …!

-

‘ఎఫ్ 2’, ‘వెంకీమామ’ వంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం నారప్ప. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని వెంకటేష్ తో తెరకెక్కిస్తున్నట్టు ముందు సురేష్ బాబు అనౌన్స్ చేయగానే దాదాపు అందరి నుంచి నెగిటివ్ కామెంట్సే వినిపించాయి. అయితే నారప్ప అన్న టైటిల్ ని ఫిక్స్ చేసిన సురేష్ బాబు టైటిల్ తో పాటు వెంకటేష్ లుక్ ని ఎప్పుడైతే రిలీజ్ చేశారు నెగిటివ్ గా కామెంట్స్ చేసిన వారందరికి గట్టి షాక్ తగిలింది.

 

అంతేకాదు టైటిల్ పోస్టర్ రిలీజైనప్పటి నుంచి ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రెండు సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న వెంకీ నారప్ప తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడట. ఇక తమిళ్‌లో అసురన్ 100 కోట్ల కి పైగా వసూళ్ళు సాధించి సంచలన విజయాన్ని అందుకుంది. అనంతపురం లో ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాని కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘బ్రహ్మోత్సవం’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ని తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

 

పెళ్ళి తర్వాత చాలాకాలంగా సినిమాలకి దూరంగా ఉన్న ప్రియమణి నారప్ప తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తోంది. చెప్పాలంటే రీ ఎంట్రీ తో రెండు మంచి సినిమాలలో అవకాశం అందుకుంది. అందులో ఒకటి రానా విరాటపర్వం కాగా మరొకటి వెంకటేష్ నారప్ప. ఈ సినిమాలో ప్రియమణి సహజత్వంతో కూడుకున్న ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తుంది. అయితే తాజాగా నారప్ప టీం ప్రియమణికి స్వీట్ షాకిచ్చింది. ఈ రోజు ప్రియమణి పుట్టినరోజు కావడం తో ఈ సినిమా నుండి చిత్ర బృందం ప్రియమణి లుక్ ని రిలీజ్ చేశారు. ఇది సడన్ గా ఇచ్చిన సర్‌ప్రైజ్ కావడం తో ప్రియమణి ఆనందంలో మునిగిపోతుందట. మరోవైపు విరాటపర్వం నుండి కూడా టీం ప్రియమణి లుక్ ని రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version