దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.కాగా దేవుని సన్నిధిలో కూడా ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. ప్రముఖ ఆలయాలలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఎంతో మందిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఒడిశాలో దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది కరోనా వైరస్ బారినపడటం సంచలనంగా మారిపోయింది. ఈ విషయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో పూరి జగన్నాథుని ఆలయం అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. కానీ భక్తులు మాత్రం ఆలయాన్ని తెరవాలి అంటూ రోజురోజుకు ఆలయ నిర్వాహకులు పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు 404 మంది ఆలయంలో కరోనా వైరస్ బారినపడగా.. ఇందులో 351 సేవకులు ఉండదు 53 మంది… ఇతర సిబ్బంది ఉండటం గమనార్హం. అంతేకాదు కరోనా వైరస్ బారిన పడి ఏకంగా తొమ్మిది మంది ప్రాణాలు కూడా కోల్పోయినట్లు ఆలయ అధికారులు తెలిపారు.