భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా మారింది. ఇప్పటికే లక్షల మంది దీని బారిన పడగా, వేల మంది మృతి చెందారు. లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఒక్కసారిగా ఈ మహమ్మారి విజృంభణ తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. గత 24 గంటల్లో 14,516 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,95,048 కు పెరిగింది. అలాగే కొత్తగా 375 మంది కరోనాతో మరణించగా మొత్తం మరణాల సంఖ్య 12,948 కు చేరుకుంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1,68,269 మంది చికిత్స పొందుతుండగా 2,13,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అప్పటికే ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల్లో మన భారత్ 4 వ స్థానంలో ఉంది. ఇది ఇలానే కొనసాగితే మొదటి స్థానానికి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదు.
భారత్ లో కలకలం : 13 వేల మరణాలు.. 4 లక్షల కేసులు..!
-