ఏపీ సచివాలయాన్ని ఊపేస్తున్న కరోనా…!

-

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కరోనా కట్టడి చర్యల్లో కీలకమైన ప్రభుత్వ్ అధికారులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ సచివాలయం లో మరో ఆరుగురు ఉద్యోగులకు కరోనా సోకింది. ఇప్పటి వరకు కరోనా బారిన మొత్తం 163 మంది ఏపీ సచివాలయ ఉద్యోగులు పడ్డారు అని వైద్య శాఖ అధికారులు తెలిపారు.

ఇటీవల ఒక అధికారి కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మంత్రుల పేషీల్లో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఏపీ పరిశ్రమల శాఖ మేకపాటి గౌతం రెడ్డి కరోనా దెబ్బకు తన ఆఫీస్ ని విజయవాడ మార్చుకున్నారు. మరి కొంత మంది మంత్రుల శాఖల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో విధులకు కూడా హాజరు కావడం లేదు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version