మహారాష్ట్రలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,115 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే 560 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లోనే 9 మంది కరోనా కాటుకు బలయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 5,421 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, కరోనా తొలి వేవ్ నుంచి కూడా మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఎక్కువగానే నమోదవుతూ వస్తున్నది.
ఇప్పుడు కూడా గత కొన్ని రోజుల నుంచి దేశంలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండగా, అందులో మహారాష్ట్ర కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. ఇవాళ దేశంలో 7 వేలకుపైగా కొత్త కేసులు నమోదు కాగా, ఒక్క మహారాష్ట్రలోనే వెయ్యికిపైగా కేసులు నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపినట్లు సమాచారం.