ఈ మధ్యనే వైసీపీ అధిష్టానం కావాలి వైసీపీ నాయకుడు మన్నెమాల సుకుమార్ రెడ్డిని సస్పెండ్ చేసింది. కారణాలు ఏమిటన్నది తెలియకపోయినా.. అధిష్ఠానము తీసుకున్న నిర్ణయం పట్ల అప్పటికప్పుడు సుకుమార్ రెడ్డి ఏమీ స్పందించలేదు. అయితే ఈ రోజు కాసేపటి క్రితమే అయన చెప్పిన మాటలు ఎవ్వరికీ అర్ధం కావట్లేదు. ఈయన మాట్లాడుతూ నాకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చింది వైసీపీ మరియు జగన్ అని.. ప్రస్తుతం నన్ను పార్టీ సస్పెండ్ చేసి ఉండొచ్చు అని కానీ నా తుది శ్వాస వరకు కూడా వైసీపీ తోనే జగనన్న తోనే నా రాజకీయ ప్రయాణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.