ఏపీలో కరోనా దూకుడు, 9 వేలకు పైగా కేసులు 93 మరణాలు…!

-

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 9 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. గడిచిన ఒక్క రోజులో ఏపీలో 57 వేల 148 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9 వేల 597 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. ఒక్క రోజులో రాష్ట్రంలో 93 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు అని పేర్కొంది.

ap-corona

తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో వరుసగా 1332, 1235 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 13 మంది ప్రకాశంలో 11 మంది, చిత్తూరు, నెల్లూరులో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో కేసులు 2 లక్షల 54 వేల 146కి చేరుకున్నాయి. 90 వేల 425 యాక్టివ్ కేసులు ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పటి వరకు లక్షా 61 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారని 2296 మంది మరణించారు అని ప్రభుత్వం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version