కరోనాను జయించిన పోలీసులు.. ఘనస్వాగతం పలికిన కమిషనర్..!

-

రాచకొండ పరిధి లోని కోవిడ్ ను జయించిన 211 మంది పోలీసులకు ఘనస్వాగతం పలికారు. నాచారంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమం లో రాచకొండ కమిషనర్ మహేష్ భగత్ కోవిడ్ విజేతలకు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా  కమిషనర్ మాట్లాడుతూ  కరోనా పాజిటివ్ రాగానే ఎవరు భయపడ వద్దన్నారు. కోవిడ్ తో బాధపడుతున్న పోలీస్ కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తున్నామని, మెడికల్ కిట్స్ , రోగ నిరోధ శక్తి పెంపు కోసం చవాన్ ప్రాశ్, డ్రై ఫ్రూట్స్ అందించడంతో పాటు 5000 రూపాయల ను వారి వారి అకౌంట్ లోకి జమ చేశామన్నారు.

కరోనా వచ్చిందని భయపడకుండా మానసికంగా దైర్యంగా ఉంటె కరోనా జయించవచ్చన్నారు. ప్లాస్మా డొనేట్ చేయడానికి ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని. కరోనాని జయించిన వారు అందరూ ప్లాస్మా డొనేట్ చేయాలని కమిషనర్ సూచించారు. తమకు అండగా ఉండి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్పి, వైద్య సహాయంతో పాటు అనేక రకాలుగా సహకారం అందించిన కమిషనర్ మహేష్ భగత్ కు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version