” ఫిదా “నటుడు హర్షవర్థన్ రాణె కు కరోనా వైరస్‌ పాజిటివ్‌..!

-

ఫిదా సినిమాలో ఓ కీలక పాత్ర చేసిన నటుడు హర్షవర్ధన్ కు కరోనా వైరస్ పాజిటివ్ గా రిపోర్ట్స్ వచ్చాయి. ప్రస్తుతం హర్షవర్ధన్ హోమ్ క్వారంటైన్ లో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా చేసుకొని తెలియజేశాడు. “నాకు కాస్త జ్వరంగా, కడుపు నొప్పిగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లాను అక్కడ కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక ఇప్పటి నుండి పది రోజులపాటు నేను ఒంటరిగా హోమ్ క్వారంటైన్ లో ఉంటానని ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుందని” ఆయన తెలియజేశారు.

ఇక హర్షవర్ధన్ తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తున్నాడు. నటుడు హర్షవర్ధన్ ఇటీవల నటించిన హిందీ సినిమా ‘తేయిష్’ అక్టోబర్ 29న ఓటిటి ప్లాట్ ఫామ్ ఐనా జీ5 లో విడుదల కాబోతుంది. ఇక హర్షవర్ధన్ తెలుగు ఇండస్ట్రీలో అవును, అవును2 , మాయ, ఫిదా వంటి సినిమాలలో నటించి అభిమానులను మెప్పించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version