ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న సమయంలో చైనాలో కరోనా వైరస్ ప్రభావం చాలా తక్కువగా కనపడింది. అక్కడ వైరస్ పుట్టినా సరే అది ఇతర దేశాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్న తరుణంలో అక్కడి ప్రజలు రోడ్ల మీదకు లక్షలాది మంది వచ్చారు. అయినా సరే అక్కడ మరణాలు కేసులు అనేవి లేవు. కాని ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని సమాచారం.
అక్కడ కేసులు దాదాపు కొత్తగా రెండు వేలు దాటాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు ఊహాన్ నగరానికి మాత్రమే పరిమితం అయిన కరోనా వైరస్ ఇప్పుడు దేశంలో చాలా ప్రాంతాల్లో కనపడుతుంది. ఊహాన్ లో లాక్ డౌన్ ఎత్తి వేసిన వెంటనే వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. పబ్లిక్ రవాణా కూడా భారీగా మొదలయింది. ఊహాన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళారు జనం.
ఆహారపు అలవాట్లు కూడా వాళ్ళు మానుకునే ప్రయత్నాలు చేయడం లేదు. ప్రస్తుతం అక్కడ కేసులు మొదలు కావడానికి రష్యా కారణం అని అక్కడి నుంచి విమానాలను కూడా ఆపేశారు. ఇక అక్కడి సరిహద్దులు కూడా మూసి వేసింది చైనా. అయినా సరే కేసులు మాత్రం దారుణంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కేసులను ఏ విధంగా కట్టడి చెయ్యాలి అనేది అర్ధం కావడం లేదు చైనాకు. పరిస్థితులు మరీ దారుణంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.