దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని మరో రెండు వారాల పాటు కేంద్రం పెంచింది. మే 4 నుంచి మే 17 వరకు లాక్ డౌన్ ని పెంచుతున్నామని కేంద్ర హోం శాఖ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా పలు మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు ఎవరూ బయట తిరగవద్దు అని స్పష్టం చేసింది. అత్యవసరం అనుకుంటే మినహా బయటకు రావొద్దు అని పేర్కొన్నారు.
జోన్లతో సంబంధం లేకుండా దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులను అనుమతించే అవకాశం లేదని పేర్కొంది. రైళ్ళు మెట్రో సర్వీసులను, రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులకు నిషేధం ఉంటుంది. పోలీసు, ఆర్మీ సర్వీసులకు మినహాయింపు ఇస్తుంది. వలస కార్మికులకు తరలించడానికి గానూ రైళ్ళు నడిచే అవకాశం ఉంది. అది కూడా కొన్ని రోజులే… స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు,హాస్పిటాలిటీ సర్వీసులు, సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, జిమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటైర్‌టైన్ మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, బహిరంగ సభలు, సామూహిక మత ప్రార్థనలు, ప్రార్థనాలయాలపై నిషేధం ఉంటుంది.
దేశవ్యాప్తంగా అన్ని రకాల ట్రక్కులు అన్ని రాష్ట్రాల్లో తిరిగే అవకాశం ఉంటుంది. కాని ఇద్దరు డ్రైవర్లు ఒక హెల్పర్ మాత్రమే ఉండాల్సి ఉంటుంది. రాష్ట్రాల మధ్య లారీలు తిరగాలి అంటే పాస్ లు అవసరం లేదు లైసెన్స్ చాలు.
కంటైన్‌మెంట్ జోన్ల విషయానికి వస్తే… ఈ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు పెట్టి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చెయ్యాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ కేవలం నిత్యావసర సరుకులను మాత్రమే అనుమతించాలని.. చెక్‌పోస్టు నుంచి బయటకు, లోపలికి వచ్చే వ్యక్తుల పేర్లను నమోదు చేయాలని సూచించింది. ఇక్కడ క్లినిక్‌లు, ఆస్పత్రుల్లో ఓపీ సేవలపైనా నిషేధం ఉంటుందని పేర్కొంది.
నాన్ కంటైన్ మెంట్ జోన్ల విషయానికి వస్తే… పైన పేర్కొన్న విషయాలతో పాటుగా ఇక్కడ రిక్షాలు, ఆటోలు, టాక్సీలు, బస్సులు, బార్బర్ షాపులు, స్పాలపైనా నిషేధం అమలులో ఉంటుంది. నిత్యావసర సరుకుల కోసం వెళ్ళాలి అంటే సొంత వాహనాల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. కారులో ఇద్దరు బైక్ పై ఒకరు మాత్రమే అనుమతి. నిత్యావసరాల మానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఫార్మా కంపెనీలు, ఐటీ హార్డ్ వేర్, జనపనార మిల్లులకు అనుమతి ఉంటుంది. ఇక్కడ ఎవరు అయితే సిబ్బంది పని చేస్తారో సామాజిక దూరం అనేది అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని పరిశ్రమలకు అనుమతి ఉంటుంది అని కేంద్రం పేర్కొంది. అలాగే నిర్మాణ పనులకు స్థానిక కూలీలతో నిర్వహించుకునే అవకాశం ఉంది. నగరాల్లో ఒక్కరు మాత్రమే ఉండే చిన్న షాపులను నిర్వహించుకునే అవకాశం ఉందని చెప్పింది.
నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచే ఉంచుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అన్ని రకాల దుకాణాలు అనుమతి ఇస్తారు. కాని రెండు అడుగుల సామాజిక దూరం మాస్క్ అవసరం. వ్యవసాయ పనులకు అనుమతి ఉంటుంది. నిత్యావసర సరుకులను సరఫరా చేసే ఈకామర్స్ సైట్లకు అనుమతి ఇస్తారు. ప్రైవేట్ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.
ఆరెంజ్ జోన్ల విషయానికి వస్తే… అంతర్ జిల్లా బస్సు సర్వీసులు, జిల్లాల లోపల తిరిగే బస్సులకు అనుమతి ఇవ్వరు. ఒక డ్రైవర్, ఇద్దరు ప్యాసింజర్లతో టాక్సీలు నడుపుకునే అవకాశం ఉంటుంది. కారులో ఆరెంజ్ జోన్‌లో ఉన్న ఇతర జిల్లాలకు ప్రయాణించే అవకాశం ఉంది. బైక్ పై ఇద్దరు వెళ్ళవచ్చు.
గ్రీన్ జోన్ విషయానికి వస్తే… గ్రీన్ జోన్లలో అన్నింటికీ దాదాపుగా అనుమతి ఉంటుంది. బస్సులు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడుపుకునే అవకాశం ఉంటుంది. వైన్ షాప్స్, పాన్ షాప్స్‌లకు కూడా అనుమతి ఇస్తారు గాని ఆరడుగల సామాజిక దూరం పాటించాలని స్పష్టం చేసింది.