కొడుకు కరోనా చికిత్స కోసం తల్లి ఆత్మహత్య బెదిరింపు.. చివరికి!

-

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కోటి 26 లక్షలమందికిపైగా వ్యాపించింది. ఇంకా ఇందులో 75 లక్షలమంది కరోనా నుండి కోలుకున్నారు. 5 లక్షలమందికిపైగా కరోనా వైరస్ కు బలయ్యారు.

coronavirus positive man died after 3 hospitals refused to admit in kolkata

ఇక పోతే కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు దారుణంగా పెరిగిపోతున్నాయి. మన దేశంలోనూ వేలకేసులు నమోదువుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కోల్‌క‌తాలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క‌రోనా బారిన‌ప‌డిన ఇంటర్ విద్యార్థికి తగిన వైద్యం అందక కన్నుమూశాడు.

అయితే ఆ విద్యార్థిని మూడు ఆస్పత్రులకు తీసుకువెళ్ళినప్పటికీ చేర్చుకోవ‌డానికి నిరాకరించారు. దీంతో నాల్గ‌వ ఆసుప‌త్రిలో బాధితుడిని తీసుకెళ్లగా అక్కడ చేర్చుకొను అన్నారని ఆ విద్యార్థి త‌ల్లి తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరించ‌డంతో వారు చేర్చుకున్నారు. డయాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్నాడు ఇంకా ఈ నేపథ్యంలోనే అతని కరోనా వైరస్ సోకింది.

దీంతో అతని కుటుంబ స‌భ్యులు మూడు ఆసుప‌త్రుల చుట్టూ తిరిగారు. ఎక్క‌డా బాధితుడిని చేర్చుకోలేదు. దీంతో బాధితుని త‌ల్లి కోల్‌కతా మెడికల్ కాలేజీకి చేరుకుని, త‌న కుమారునికి చికిత్స అందించ‌క‌పోతే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరించడంతో ఆ ఆసుపత్రిలో బాధితుడిని చేర్చుకున్నారు. అయితే ఆ విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుని తండ్రి మాట్లాడుతూ సకాలంలో కుమారుడికి వైద్యం అందలేదని, కోల్‌కతా మెడికల్ కాలేజీలోనూ సిబ్బంది నిర్ల‌క్ష్యం వ‌హించార‌ని అయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version