దారుణం: కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన నీచపు తండ్రి …!

-

తాజాగా ఓ అమానుష సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన సీతానగరం మండలంలో నిడ‌గ‌ల్లు గ్రామానికి చెందిన మైనరు అనే వ్యక్తి కి ఇద్దరు కుమార్తెలు. వారిద్దరికీ వివాహాలు కూడా జరిగాయి. అయితే కన్న తండ్రి తన పెద్ద కూతురు పై కన్నేశాడు. ఈ నేపథ్యంలోనే తన ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఇద్దరు కుమార్తెల కు సమాచారం అందించడంతో మొదటగా చిన్న కూతురు వచ్చి సేవలు అందించడం మొదలు పెట్టింది. అయితే చిన్న కూతురు వచ్చి చాలా రోజులు సేవలు అందించడంతో ఇక నువ్వు వెళ్ళు, అక్కను పిలిపించు అని తండ్రి తెలిపాడు.

rape attempt

ఈ నేపథ్యంలో చెల్లెలు వెళ్లిపోవడంతో అక్కడ తండ్రి దగ్గరకు రావడం జరిగింది. అయితే కామంతో తన కూతురి పై కన్నేసిన తండ్రి కోరిక తీర్చుకోవడానికి అదే అనుకూల సమయం అని భావించాడు. దీంతో ఆమెను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని భరించలేక సదరు గ్రామ వాలంటీర్ ను వెంటపెట్టుకుని పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో బొబ్బిలి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా మైనర్ ను శనివారం పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version