రైతులకు గుడ్ న్యూస్.. తెల్ల బంగారానికి ఆల్ టైం రికార్డ్ ధర

-

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర వస్తే ఆ రైతు ఆనందం మాటల్లో చెప్పలేం. అయితే.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్ లో పత్తి ఆల్ టైం రికార్డ్ ధర పలికింది. ఒక క్వింటాల్ పత్తికి 13 వేల ధర లభించింది. మార్కెట్‌ చరిత్రలోనే అత్యధికంగా ధరలు పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీ గ్రేడ్ పత్తి ధర క్వింటం 12 వేల 500 రూపాయలు పలికింది. పత్తి బేళ్లకు, గింజలకు డిమాండ్ పెరగడంతో ప్రైవేట్ వ్యాపారులు పోటీపడి పత్తి కొంటున్నారు.

రైతులు కూడా మంచి ధర వస్తుండడంతో ఇప్పటి వరకు నిల్వ చేసిన పత్తిని మార్కెట్ కు తెస్తున్నారు. పత్తి వ్యాపారుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో.. పత్తి ధరలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. అంతేకాకుండా ఈ సీజన్ లో పట్టి దిగుమతులు తగ్గడంతో.. పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. దీంతో పత్తి ధరలు అనూహ్యంగా పెరిగి పోతున్నాయి. అయితే.. దీంతో.. పట్టి రైతులకు మంచి రోజులు వచ్చాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version