మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతమవుతున్నారు. అయితే బొజ్జల శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అయితే తాజాగా.. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భౌతిక కాయానికి శుక్రవారం రాత్రి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళి అర్పించారు. బొజ్జల మృతి వార్త తెలిసినంతనే.. బొజ్జల ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగభరిత ట్వీట్‌ను పోస్ట్ చేశారు లోకేశ్.
దీంతో రాత్రి నేరుగా బొజ్జల నివాసానికి వెళ్లారు లోకేష్. బొజ్జల మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించిన్న లోకేష్.. బొజ్జల కుమారుడు, టీడీపీ యువనేత బొజ్జల సుధీర్ రెడ్డిని ఆయన ఓదార్చారు. 1949 ఏప్రిల్ 15న శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మించారు.బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తండ్రి సుబ్బరామిరెడ్డి కూడా శ్రీకాళహస్తి నుండి గతంలో ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఇదే అసెంబ్లీ స్థానం నుండి బోజ్జల గోపాలకృష్ణారెడ్డి గెలుపొందారు.