ఆ తప్పు వల్లే షార్ట్ సర్క్యూట్ అవుతుందా? ఏం చెయ్యాలంటే?

-

ఈ మధ్య ఎక్కువగా ఈ పదం వింటున్నాము.. ఇల్లు,వాహానాలు,ఆఫీస్ ఇలా ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో కాలిపొయాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎందుకు అలా అవుతుంది అనేది మాత్రం చాలా మందికి తెలియదు.. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరిగినప్పుడు ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.

మనం నిత్యం ఇంట్లో వాడే డివైజ్‌ల్లో ఆపరేటింగ్ కరెంట్ అనుకున్న యాంపియర్ల కంటే ఎక్కువ మించితే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. అందు చాలా విద్యుత్ ప్రమాదాలకు షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చు. షార్ట్ సర్క్యూట్ వల్ల పెను ప్రమాదాలు సంభవించవచ్చు. అందుకే విద్యుత్ విషయంలో ఎలాంటి పొరపాటు చేయకూడదు. లేదంటే ప్రాణాలు పోతాయి.. అంతే కదా.. అసలు షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా విద్యుత్‌ను యాంపియర్లలో కొలుస్తారన్నది తెలిసిన విషయమే. ఇక పలు డివైజ్‌లపై ఆపరేటింగ్ కరెంట్ అని రాసి ఉంటుంది. వాటిల్లో అనుకున్న డెసిమల్స్ కంటే ఎక్కువగా విద్యుత్ ప్రసారం అయితే.. అవి వేడెక్కిపోవడం లేదా కాలిపోవడం లాంటివి జరుగుతాయి. ఉదాహరణకు గీజర్ ఆపరేటింగ్ కరెంట్ 15 యాంపియర్లు కాగా, దీనికి మించితే షార్ట్ సర్క్యూట్ సంభవిస్తుంది..

ఒక విద్యుత్ సాకెట్ కు మల్టీ ప్లగ్ లను గుచ్చి పలు రకాల విద్యుత్ వస్తువులను వాడితే ఆటోమేటిక్ గా కరెంట్ లోడ్ ఎక్కువ అవుతుంది.దాంతో షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశం ఉంది.అందుకే ఇంటిలోని గృహోపకరణాలను వివిధ స్విచ్‌ల ద్వారా అనుసంధానం చేసి వినియోగించడం బెటర్. అప్పుడే ఈ ప్రమాదం నుంచి బయట పడవచ్చు..ఇది ముఖ్యంగా చెయ్యవలసిన పని.. లేకుంటే మాత్రమే మీ ప్రాణాలను మీరే రిస్క్ లో పడేసిన వారవుతారు..జాగ్రత్త..

Read more RELATED
Recommended to you

Exit mobile version