Samsung : శాంసంగ్‌కు రూ.78 కోట్లు ఫైన్..

-

ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ శాంసంగ్ అనుబంధ సంస్థ శాంసంగ్ ఆస్ట్రేలియాకు భారీ జరిమానా విధించింది అక్కడి ఫెడరల్ కోర్టు. వాటర్ రెసిస్టెంట్ పేరిట తప్పుదోవ ప్రకటనలు ఇచ్చినందుకు గానూ 14 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.78 కోట్లు) ఫైన్ వేసింది. 30 రోజుల్లోగా ఈ మొత్తం చెల్లించాలని పేర్కొన్నారు ఫెడర్ కోర్టు జడ్జి జస్టిస్ బ్రెండన్ ముర్ఫీ. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్కు మరో 2 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.1.10 కోట్లు) చెల్లించాలని ఆదేశించారు న్యాయమూర్తి. తమ స్మార్ట్ఫోన్లు నీటిని తట్టుకుంటాయంటూ 2016-2018 మధ్య శాంసంగ్ కొన్ని ప్రకటనలు విడుదల చేసింది. ఆ కంపెనీకి చెందిన ఎస్7, ఎస్7 ఎడ్జ్. ఏ5 (2017), ఏ7 (2017), ఎస్8, ఎస్8 ప్లస్, నోట్ 8 ఫోన్ల ప్రచారానికి ఈ తరహా ప్రకటనలను ఉపయోగించింది.

ప్రచారంలో భాగంగా స్విమ్మింగ్ పూల్స్లో ఈదినా, సముద్రంలో మునిగినా ఈ ఫోన్లు తట్టుకుని నిలబడతాయని ప్రకటనలిచ్చింది. వాస్తవంలో ఈ ఫోన్ల ఛార్జింగ్ పోర్టులు పాడయ్యాయి. తడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడితే ఫోన్లు పూర్తిగా పనిచేయడం మానేసినట్లు వందల సంఖ్యలో ఆస్ట్రేలియన్ కాంపీటీషన్ అండ్ కన్జూమర్ కమిషన్కు పిర్యాదులు అందాయి. దీనిపై కమిషన్ విచారణ జరిపింది. శాంసంగ్ వంటి పెద్ద కంపెనీలు ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదని జడ్జి శాంసంగ్ కు సూచించారు. ఇలాంటి ప్రకటనలు చూసి పెద్ద ఎత్తున ఫోన్లు కొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రకటనల
సమయంలో శాంసంగ్ పొందిన లాభం కంటే తాము విధించిన పెనాల్టీనే అధికంగా ఉందని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version