కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 15 నుంచి18ఏండ్ల లోపు బాలబాలికలకు వ్యాక్సినేషన్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా వచ్చే 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు కోవిన్ యాప్ చీఫ్ తెలిపారు. స్టూడెంట్ ఐడీ కార్డును వినియోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం కరోనా కేసులు 6531 వెలుగు చూశాయి. నిన్నటి(ఆదివారం)తో పోలిస్తే కేసుల పెరుగుదలలో 6.7శాతం నెలకొన్నది. ప్రస్తుతం దేశంలో 75,481 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కేసుల సంఖ్య తగ్గిపోవడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేశాయి. పండుల సీజన్ మొదలు కావడం, పెద్ద ఎత్తున వివాహాలు జరుగుతుండటంతో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తున్నది.