ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు నెలలకోసారి కొత్త వేరియంట్ వస్తు… ప్రజలను కబళించి వేస్తోంది. అయితే ఈ కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా దేవాలయాలపై పడుతుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు కూడా దేవాలయాలకు రావడంపై ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలకమండలి బిగ్ షాక్ ఇచ్చింది.
తిరుమలకు విచ్చేసే భక్తులుకు కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తూ నిన్న నిర్ణయం తీసుకుంది టిటిడి. కోవిడ్ వ్యాక్సిన్ లేదా 48 గంటల ముందుగా పోందిన నెగటివ్ సర్టిఫికేట్ వుంటేనే అలిపిరి వద్ద అనుమతించాలని నిర్ణయం తీసుకుంది టిటిడి. ఎల్లుండి జనవరి మసానికి సంభంధించిన వసతి గదులు కోటాను విడుదల చేయనుంది. అయితే సర్వదర్శనం టోకేన్లు విడుదల పై వీడని సందిగ్దత నెలకొంది. ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో కోటాను విడుదల చేసే అంశం పై పునరాలోచనలో ఉంది టిటిడి పాలక మండలి. కాగా నిన్న శ్రీవారిని 31815 మంది భక్తులు దర్శించుకున్నారు.తలనీలాలు 14538 మంది భక్తులు సమర్పించగా… హుండీ ఆదాయం 3.43 కోట్లకు చేరింది.