కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (16-09-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో బుధ‌‌వారం (16-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

1. ఢిల్లీలో కొత్త‌గా 4,473 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,30,269కి చేరుకుంది. 4,839 మంది చ‌నిపోయారు. 30,914 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,94,516 మంది కోలుకున్నారు.

2. ఏపీలో కొత్త‌గా 8,835 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,92,760కు చేరుకుంది. 5,105 మంది చ‌నిపోయారు. 90,279 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,97,376 మంది కోలుకున్నారు.

3. కరోనా బారిన పడి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ తుది శ్వాస విడిచారు. ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. 28 ఏళ్ళకే ఆయన మంత్రిగా పని చేశారు.

4. భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ శుభ‌వార్త చెప్పింది. ర‌ష్యాకు చెందిన స్పుత్‌నిక్‌-వి క‌రోనా వ్యాక్సిన్‌ను భార‌త్‌లో డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ విక్ర‌యించ‌నుంది. అలాగే ఈ వ్యాక్సిన్‌కు గాను ఆ సంస్థే క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ను కూడా చేప‌ట్ట‌నుంది.

5. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు గాను క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ భార‌త్‌లో ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ట్ర‌య‌ల్స్‌ను మ‌ళ్లీ మొద‌లు పెట్టారు. ఈ మేర‌కు డీసీజీఐ సీరం ఇనిస్టిట్యూట్ కు అనుమ‌తులు ఇచ్చింది.

6. తెలంగాణ‌లో కొత్త‌గా 2,273 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య‌ 1,62,844 కు చేరుకుంది. 1,31,447 మంది కోలుకున్నారు. 996 మంది చ‌నిపోయారు.

7. దేశంలో కొత్త‌గా 81,964 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 50,08,878కి చేరుకుంది. 82,038 మంది మృతి చెందారు. 9,93,075 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 39,31,356 మంది కోలుకున్నారు.

8. చైనా తయారు చేస్తోన్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ నవంబర్ వర‌కు అక్క‌డి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానుంది. ఈ మేర‌కు చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్ (సీడీసీ) వివ‌రాల‌ను వెల్లడించింది.

9. కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. అనారోగ్యం కార‌ణంగా ఆయ‌న డాక్ట‌ర్‌చే టెస్టులు చేయించుకున్నారు. దీంతో ఆ టెస్టుల్లో గ‌డ్క‌రీకి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేలింది.

10. మహారాష్ట్రలో కొత్తగా 23,365 క‌రోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,21,221కు చేరుకుంది. 30,883 మంది చ‌నిపోయారు. 7,92,832 మంది కోలుకున్నారు. 2,97,125 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version