కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (21-07-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో మంగ‌ళ‌‌వారం (21-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

1. తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్లు, ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, ఇత‌ర హెల్త్ సెంట‌ర్ల‌లో వైద్యుల‌ను నియ‌మించే ప్ర‌క్రియ చేప‌ట్టింది. ముందుగా 225 మంది సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌ల‌ను నియ‌మించుకోనున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్ల‌లో డాక్ట‌ర్ల‌ను 6 నెల‌ల పాటు కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో నియ‌మించుకోనున్నారు. వారికి నెల‌కు రూ.70వేల వేత‌నం ఇవ్వ‌నున్నారు.

2. క‌రోనా కార‌ణంగా మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభం కావ‌ల్సిన అమ‌ర్‌నాథ్ యాత్ర ర‌ద్ద‌యింది. క‌రోనా నేప‌థ్యంలో యాత్ర‌ను పూర్తిగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు అమర్‌నాథ్ దేవ‌స్థానం బోర్డు ప్ర‌క‌టించింది. యాత్ర‌ను నిర్వ‌హించాల‌ని అనుకున్నా.. చివ‌రి నిమిషంలో ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

3. ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌, షెడ్యూల్‌పై బీసీసీఐ వారం లేదా 10 రోజుల్లో స‌మావేశం కానుంది. అందులో ఐపీఎల్ ఫైన‌ల్ షెడ్యూల్‌పై నిర్ణ‌యం తీసుకుంటారు. ఒక్క మ్యాచ్‌ను కూడా త‌గ్గించ‌కుండా పూర్తి స్థాయిలో ఐపీఎల్‌ను దుబాయ్‌లో నిర్వ‌హిస్తామ‌ని.. ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేష్ పటేల్ మీడియాకు తెలిపారు. బీసీసీఐ ఈ విష‌యంపై నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు.

4. ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 5వేల వ‌ర‌కు క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,668కు చేరుకుంది. 32,336 యాక్టివ్ కేసులుండ‌గా.. 25,574 మంది కోలుకున్నారు. మొత్తం 758 మంది చ‌నిపోయారు.

5. క‌రోనాను క‌ట్ట‌డి చేయాలంటే మాస్క్‌ను ధ‌రించ‌డ‌మే ఉత్త‌మమైన మార్గ‌మ‌ని సీఎస్ఐఆర్ చీఫ్ శేఖ‌ర్ సి మండే పేర్కొన్నారు. కేవ‌లం బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మాత్ర‌మే కాకుండా ఆఫీసుల్లో ప‌నిచేస్తున్న‌ప్పుడు కూడా మాస్కుల‌ను ధరించాల‌న్నారు. జ‌నం ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశాల్లో తిర‌గ‌వ‌ద్ద‌న్నారు. ఆఫీసుల్లో ప‌నిచేసే చోట్ల గ‌దుల్లోకి గాలి, వెలుతురు ఎక్కువ‌గా వ‌చ్చేలా చూసుకోవాల‌న్నారు.

6. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 1,48,55,107కు చేరుకుంది. మొత్తం 6,13,248 మంది చ‌నిపోయారు. మొత్తం 89,07,167 మంది కోలుకున్నారు. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 39,61,429కు చేరుకుంది. 1,43,834 మంది చ‌నిపోయారు. మొత్తం 18,49,989 మంది కోలుకున్నారు.

7. దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 37,148 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క రోజులోనే 587 మంది చ‌నిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 11,55,191కి చేరుకోగా, 28,084 మంది చ‌నిపోయారు. 7,24,577 మంది కోలుకున్నారు. 4,02,529 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

8. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీతో క‌లిసి కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప‌నిచేస్తున్న సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అద‌ర్ పూనావాలా మీడియాతో మాట్లాడారు. ఫేజ్ 3 ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంత‌మైతే తాము ఇండియాలో ఉత్ప‌త్తి చేసే వ్యాక్సిన్ డోసుల నుంచి నెల నెలా 50 శాతం వ్యాక్సిన్‌ను ఇండియాకే అంద‌జేస్తామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వాలు వ్యాక్సిన్‌ను ప్ర‌జ‌ల‌కు ఉచితంగా అంద‌జేస్తాయ‌న్నారు.

9. క‌రోనాపై రాష్ట్రంలో నెల‌కొన్న వాస్త‌వ ప‌రిస్థితులు, ఇత‌ర వివ‌రాల‌ను హైకోర్టుకు అఫిడ‌విట్ రూపంలో అందజేయాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. హైకోర్టు ఆదేశించిన నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

10. భార‌త్ బ‌యోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్ టీకాను నిమ్స్‌లో ఇద్ద‌రు వాలంటీర్లకు సోమ‌వారం అంద‌జేసిన విష‌యం విదిత‌మే. కాగా మంగ‌ళ‌వారం ఆ ఇద్ద‌రినీ డిశ్చార్జి చేశారు. వారి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌న్నారు. మ‌రో 14 రోజుల త‌రువాత వారి ఆరోగ్యాన్ని ప‌రిశీలిస్తామ‌ని వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version