కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో సోమవారం (21-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. ఏపీలో కొత్తగా 6,235 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,31,749కు చేరుకుంది. 5,410 మంది చనిపోయారు. 74,518 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,48,926 మంది కోలుకున్నారు.
2. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిగి జమాత్ సమావేశం వల్లే చాలా మందికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. 233 మంది తబ్లిగి జమాత్ సభ్యులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని తెలిపింది.
3. కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన రెండవ సెరో సర్వే పూర్తయిందని ఐసీఎంఆర్ తెలిపింది. ఈ మేరకు త్వరలోనే సర్వే వివరాలను వెల్లడిస్తామని తెలియజేసింది.
4. తమిళనాడులో కొత్తగా 5,344 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,47,337కు చేరుకుంది. 4,91,971 మంది కోలుకున్నారు. 8,871 మంది చనిపోయారు.
5. కర్ణాటకలో కొత్తగా 7,339 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,26,876కు చేరుకుంది. 8,145 మంది చనిపోయారు. 4,23,377 మంది కోలుకున్నారు. 95,335 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
6. బ్రిటన్‌కు చెందిన ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్‌కు చెందిన బ్లూ ప్రింట్‌ను విడుదల చేసింది. 111 పేజీల క్లినికల్ ట్రయల్స్ బ్లూ ప్రింట్‌ను ఆ సంస్థ ఆన్‌లైన్ లో ఉంచింది.
7. దేశంలో కొత్తగా 86,961 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 54.87 లక్షలకు చేరుకుంది. 10,03,299 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 87,882 మంది చనిపోయారు.
8. తెలంగాణలో కొత్తగా 1302 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,72,608కి చేరుకుంది. 1,41,930 మంది కోలుకున్నారు. 1042 మంది చనిపోయారు. 29,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
9. కరోనా బారిన పడి హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న రోగుల్లో గురక పెట్టి నిద్రించేవారికి ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. అలాంటి వారు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేల్చారు.
10. యూపీలో కొత్తగా 4,703 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,58,893 కు చేరుకుంది. 5,135 మంది చనిపోయారు. 64,164 మంది చికిత్స తీసుకుంటున్నారు.