సీఎం జగన్ కీలక నిర్ణయం.. భిక్షగాళ్లకు కోవిడ్-19 కిట్‌లు..!

-

కరోనాపై పోరాటంలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భిక్షగాళ్లు, చిత్తుకాగితాలు ఏరుకునే వారు, ఎలాంటి ఆధారం లేకుండా చెట్ల కింద, బస్టాండ్లలో ఉండే వారు కరోనా బారిన పడకుండా ఉండేందుకు వారికి కోవిడ్-19 కిట్‌లను ఇవ్వబోతోంది. తొలిసారిగా కృష్ణా జిల్లాలోని భిక్షగాళ్లకు ఈ కిట్‌లను ఇవ్వనుంది. అందులో ఆరు మాస్కులు, రెండు సబ్బులు ఉండగా.. మెప్మా ద్వారా ఈ కిట్‌ను వారికి పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీని కోసం విజయవాడ కార్పొరేషన్‌తో సహా జిల్లా వ్యాప్తంగా నగరాలు,

 

పట్టణ ప్రాంతాల్లో ఉన్న భిక్షగాళ్లు, చిత్తుకాగితాలు ఏరుకునే వారు, రోడ్డుపక్క ఎటువంటి ఆధారం లేకుండా జీవిస్తున్న వార్ని ఇప్పటికే మెప్మా సహకారంతో గుర్తించారు. ఇలా గుర్తించినవారు విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో 997 మంది..మచిలీపట్నం కార్పొరేషన్‌ పరిధిలో 230 మంది, గుడివాడ సిటీలో 300 మంది, తిరువురూలో 94 మంది, జగ్గయ్యపేటలో 80 మంది, నందిగామలో 68, నూజివీడులో 60 మంది పెడనలో 58 మంది, ఉయ్యూరులో 34 మంది కలిపి మొత్తం 1991 కుటుంబాలు ఉన్నాయి. వీరందరికి త్వరలోనే ఉచితంగా కిట్లను పంపిణీ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version