ED ఓ గొర్రెల మందులు తోడేలు లాంటిది.. బిజెపికి బ్లాక్ షిప్ – సిపిఐ నారాయణ

-

ఢిల్లీః గొర్రెల మందలో తోడేలు లాంటిది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ.డి….ఖచ్చితంగా ఈ.డి ఓ “బ్లాక్ షిప్”…..అని ఫైర్ అయ్యారు సిపిఐ నేత నారాయణ. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌతు కు ఈరోజు ఈ.డి నోటీసులు ఇవ్వడం అసమంజసం..బిజేపి కి ఇలాంటి పనికిమాలిన పనులు చేయమని సంఘపరివార్, ఆర్.ఎస్.ఎస్, విశ్వహిందూ పరిషత్ చెప్పిందా..!? అని నిప్పులు చెరిగారు.

అస్సాంలో కూర్చుని ఎమ్.ఎల్.ఏ ల బలం ఉందని ఎలా చెప్తారు… ముంబయ్ కు వచ్చి సభలో బలాన్ని నిరూపించుకోండని హెచ్చరించారు. కేంద్రం లోఅధికారంలో ఉన్న బిజేపి ఎందుకు శివసేన చీలిక వర్గాన్ని ప్రోత్సహిస్తుంది…!?శివసేన లో సంక్షోభం ఉంటే వాళ్లు వాళ్లు పరిష్కరించుకుంటారు…బిజేపి కి ఎందుకు…!?అని నిలదీశారు. బిజేపి కి నచ్చని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో,చీలికలు తేవడం, అధికారం లోకి రావడానికి ఎన్నెన్నో కుట్రలు, అనైతిక చర్యలకు పాల్పడడం ఏమిటి…!? అని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version