కోమటిరెడ్డి బ్రదర్స్​కు సిద్ధాంతాలు, నైతిక విలువలు లేవు : సీపీఐ సాంబశివరావు

-

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి జంపింగ్‌లు చేస్తున్న నాయకులు ఓవైపు ఉంటే.. మరో వైపు పార్టీలోనే ఉంటూ కోవర్టుగా మారతున్నారు. ఇటీవల కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందిస్తూ.. కోమటిరెడ్డి బ్రదర్స్​కు సిద్ధాంతాలు, నైతిక విలువలు లేవని అన్నారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం సీపీఐ ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణ పురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు పల్లా వెంకటరెడ్డితో సాంబశివరావు పాల్గొన్నారు. తర్వాత పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ కాంగ్రెస్ లో ఉంటూ ఆ పార్టీ గెలవదని…రాజగోపాల్ రెడ్డి కే ఓటు వేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరడం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డిని బలహీనపరిచేందుకే వెంకటరెడ్డి తన తమ్ముడికి సహకరిస్తున్నారన్నారు.

రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి కోసం రాజీనామా చేశానని చెప్తున్నాడని, అదే నిజమైతే తిరిగి అదే పార్టీ నుంచి ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పశువుల్లాంటివారని ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడికి వెళ్తారన్నారు. కరోనా, క్యాన్సర్ కంటే బీజేపీ సిద్ధాంతాలు ప్రమాదమని, అందుకే తాము ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నామన్నారు. సీపీఐ యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల కార్యదర్శులు గోదా శ్రీరాములు, నెల్లికొండి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, పట్టణ కార్యదర్శి చిలువేరు అంజయ్య పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version