బీజేపీ వాళ్లు అడ్డంగా దొరికినా బుకాయిస్తున్నారు : కూనంనేని సాంబశివరావు

-

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై మండిపడ్డారు. చట్టాలు, వ్యవస్థపై నమ్మకం లేని వ్యక్తం బండి సంజయ్‌ అని, అసహనంతో మాట్లాడుతున్నారని. అడ్డంగా దొరికినా బుకాయిస్తున్నారంటూ ఘాటూగానే స్పందించారు కూనంనేని సాంబశివరావు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధం లేని విషయాల్లో బండి సంజయ్‌ ఎందుకు మాట్లాడుతున్నాడని ప్రశ్నించారు. ఢిల్లీ డీల్‌పై నువ్వెందుకు ప్రమాణాలు చేస్తున్నావని ప్రశ్నించారు. ధైర్మం, దమ్ము ఉంటే మోదీతో ప్రమాణం చేయించాలని డిమాండ్‌ చేశారు. దేవుడంటే భక్తి లేదని, నమ్మకం లేదని, మతంపేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టు పార్టీలు వేల కోట్లు తీసుకున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని, బీజేపీని గద్దె దించేందుకే తాము లౌకిక శక్తులతో పోరాటం చేసేందుకే కలిశామన్నారు.

సంజయ్‌ దమ్ముంటే రాజ్యాంగంపై ప్రమాణం చేయాలని, బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. వారికి ఎన్ని వేల కోట్లు ఇచ్చారని నిలదీశారు. మీరు చేస్తే సంపారం.. తాము పొత్తు పెట్టుకుంటే తప్పా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ వ్యవస్థలా సీబీఐ తయారైందని, చాలా రాష్ట్రాలు సీబీఐని బహిష్కరించాయన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోకి సీబీఐ అనుమతి లేదని జీవో ఇచ్చిందని, వచ్చే ఎన్నికల్లో రూపాయి ఖర్చు పెట్టకుండా ఎన్నికల బరిలో ఉంటామని ప్రమాణం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయవచ్చా? అని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version