జగిత్యాలలో రసాభాసాగా షర్మిల ‘మాట-ముచ్చట’

-

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారం మండల కేంద్రంలో YSRTP అధ్యక్షురాలు షర్మిల స్థానికులతో నిర్వహించిన ‘మాట – ముచ్చట’ కార్యక్రమం రసాభాసాగా మారింది. షర్మిల ప్రసంగాన్ని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. వెంటనే స్పందించిన YSRTP కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితిని గమనించిన పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువురిని శాంతింపజేశారు. కారు పార్టీ కార్యకర్తల ఓవరాక్షన్ పై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు మాట్లాడితే ఇలానే అడ్డుకోవాలని చూస్తారని ఆరోపించారు.

టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందితే సరిపోతుందా అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు చెప్పి రూ.70 వేల కోట్లు మింగేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని మండిపడ్డారు. గల్ఫ్ బాధితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని మర్చిపోయిందన్నారు. ఈ నియోజక వర్గంలో గల్ఫ్ బాధితులు ఎక్కువగా ఉన్నారని..వారి కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలంగాణ సర్కారు మర్చిపోయిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version