అమ‌రావ‌తి రైతుల‌కు బిగ్ షాక్.. బహిరంగ సభకు సీపీఎం దూరం

-

తిరుపతిలో జరిగే రాజధాని రైతుల బహిరంగ సభకు సీపీఎం పార్టీ దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. రాజధాని రైతులు తిరుపతి సభకు ఆహ్వానించారు.. మేమూ వెళ్లాలనుకున్నామ‌ని…కానీ కేంద్ర బీజేపీ నేతలు ఈ సభలకు హాజరవుతున్నారని తెలిసింద‌ని తెలిపారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.
రాష్ట్ర ప్రయోజనాలకు హాని తలపెట్టింది బీజేపీ పార్టీనేన‌ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు నిప్పులు చెరిగారు. అలాంటి బీజేపీ నేతలు పాల్గొనే సభల్లో మేం పాల్గొనలేమ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలనేదే సీపీఎం పార్టీ విధానమ‌ని గుర్తు చేశారు. ఢిల్లీలో ఓ మాట.. ఏపీ లో మరో మాట మాట్లాడే బీజేపీ నేతలు పాల్గొనే సభలో పాల్గొనడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు వెల్ల‌డించారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలి.. బీజేపీ ద్రోహాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయ‌న కోరారు. మూడు రాజధానుల అంశానికి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి వాచకం పలకాలని వెల్ల‌డించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.

Read more RELATED
Recommended to you

Exit mobile version