తెలంగాణలో జనసేన – సీపీఎం పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. ఈ విషయమై ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భేటీలో తెలంగాణలో జనసేన ప్రభావం, అనుసరించాల్సిన వ్యూహం పై నేతలు సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు సీపీఎం జనసేనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందంటూ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భేటీ పాల్గొని పొత్తుపై చర్చించారు. మరో రెండు మూడు రోజుల్లో పొత్తుపై పవన్ కల్యాణ్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.