తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని భాజపా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణలో మొత్తం 119 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ దిశగా అభ్యర్థులను ఖరారు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 15న పాలమూరులో జరగనున్న బహిరంగ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నట్లు తెలిపారు. అదే రోజు 50 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపారు.
ఎన్నికల ప్రచారానికి మోదీ, అమిత్ షా
ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రానున్నట్లు భాజపా నేత కిషన్ రెడ్డి తెలిపారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు ప్రచారానికి వస్తారని పేర్కొన్నారు. తెరాస, కాంగ్రెస్ , భాజపా మధ్యే పోటీ ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.