వ్యాన్‌లోనే నివాసం..ఇప్పటికి 45 దేశాలు చుట్టేసిన క్రేజీ కపుల్..!‌

-

వ్యాన్ లైఫ్ స్టైల్ ఈ మధ్య చాలామంది అవలంబిస్తున్నారు. ఇల్లు లేకుండా..ఎంచక్కా..అన్నీ వ్యాన్ లోనే..వ్యాన్ వారికి ఇంద్రభవనం..ఎక్కడికి కావాలన్నా వ్యాన్ వేసుకుని వెళ్లిన రాత్రికి ఇంటికి వచ్చేయాలి అని ఉండదు..వ్యాన్ ను ఇల్లు లా చేసుకుని..ప్రపంచదేశాలను తిరుగుతున్న జంటకథ ఇది..వీళ్లు లైఫ్ స్టైల్ చూస్తే..ట్రావలింగ్ మీద ఇంట్రస్ట్ ఉన్నవాళ్లకు భలే నచ్చుతుందిలేద..
కాజ్జీ మాగెన్నిస్, బ్రాడ్లీ విలియమ్స్.. ఇద్దరి వయసూ 28 ఏళ్లే. రోజంతా వ్యాన్ లో తిరుగుతూ… అప్పుడప్పుడూ మాత్రమే పనిచేసేలా తమ లైఫ్ స్టైల్ ని వీరు మార్చుకున్నారు. డ్రీమ్ బిగ్ అనే బ్లాగ్ స్టార్ట్ చేసిన వీళ్లు… ప్రపంచ దేశాల్లో టూరిజం ప్రదేశాలకు తిరుగుతూ… ఎక్కడికి వెళ్లినా ఆ వివరాలు, విశేషాలను తమ బ్లాగ్ లో రాయడం మొదలుపెట్టారు. ఫొటోలు, వీడియోలు కూడా పోస్ట్ చేస్తారు. ఇలా ఆరేళ్లుగా చేస్తున్నందువల్ల ప్రపంచంలో అతిపెద్ద అడ్వెంచర్ ట్రావెల్ బ్లాగుల్లో వీళ్లది కూడా ఒకటిగా నిలిచింది.
ఒకప్పుడు సౌత్ ఈస్ట్ ఇంగ్లండ్ లోని కెంట్ లో ఉన్న ఈ జంట… ఆరేళ్ల కిందట దక్షిణ అమెరికా నుంచి తమ జర్నీ ప్రారంభించారు. అలా వీరు సౌత్ అమెరికా దేశాలతోపాటూ… మధ్య అమెరికా, ఆసియా దేశాల్లో చాలా వాటిని సందర్శించారు.
ఇండియా, నేపాల్ తోపాటూ వీళ్లు థాయిలాండ్, కంబోడియా, ఫిలిప్పీన్స్, లావోస్, శ్రీలంక సహా యూరప్ లో ఆరు నెలలపాటూ 27 దేశాల్లో తిరిగారట..అలా నేటికి మొత్తం 45 దేశాలు పూర్తి చేశారట.
వీళ్ల వ్యాన్ పేరు హెలెన్. ఆరేళ్ల కిందట జర్నీ ప్రారంభించినప్పుడు వీరికి వ్యాన్ లేదు. అప్పట్లో మామూలుగానే వెళ్లేవారు. 2020లో ప్రపంచ దేశాల్లో కరోనా వచ్చినప్పుడు పాత వ్యాన్ ని ఇలా ఇల్లులా మార్చేశారు. అందుకు 3 నెలలు కష్టపడ్డారట..
వ్యాన్ ఎలా ఉండాలి, దాన్ని ఎలా తయారుచెయ్యాలి అనేది యూట్యూబ్ ద్వారా.. వీడియోలను చూసి నేర్చుకున్నారు. వేస్ట్ మెటీరియల్స్ తోనే వ్యాన్ ని అద్భుతంగా.. తీర్చిదిద్దారు. ఇప్పుడు రోజంతా అందులోనే తిరుగుతున్నారు.
కరోనా జోరుగా ఉన్న సమయంలో కూడా వీరు ట్రావెల్ మాత్రం ఆగలేదు..ప్రపంచంలోని ప్రతీ దేశాన్నీ చూడాలన్నది వీరి కల. అందుకు ఎంత కాలం పట్టినా ప్రయత్నిస్తూనే ఉంటామంటోంది ఈ జంట.
చాలామందికి ప్రపంచం మొత్తం చుట్టిరావాలని ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల కల కలలానే ఉండిపోతుంది..కానీ ఈ జంట ఆరేళ్లనుంచి అదేపనిలో ఉన్నారు. ఇద్దరి ఆలోచనలు ఒకటే అయితే..ఇలాంటివి చేయడం పెద్ద కష్టమే కాదు కదా..!
https://instagram.com/dreambigtravelfar?utm_medium=copy_link
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version