ఏపీలో జోరుగా క్రికెట్ బెట్టింగ్…ఒకరు మృతి.

-

ఏపీలో బెట్టింగ్‌లు మూడు పూవులు ఆరు కాయలన్నట్లు’ కొనసాగుంది..ముఖ్యంగా గుంటూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతుంది..తాజాగా క్రికెట్‌ బెట్టింగ్‌ కారణంగా ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయాడు..మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.. బెట్టింగ్‌లో ఇద్దరు బెల్లంకొండకు చెందిన యువకులు లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు. మనస్తాపంతో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ సురేష్‌ మృతి, కొమురయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యయత్నానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు..బెట్టింగ్‌లో సురేష్‌, కొమురయ్యలు రూ.లక్ష పోగొట్టుకున్నారు. బెట్టింగ్‌ నిర్వాహకుడికి రూ. 30వేలు చెల్లించారు. మరో రూ.80 వేల కోసం నిర్వాహకుడు పట్టుబట్టాడు. దీంతో ఆ డబ్బులు కట్టలేక యువకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు..ఈజీ మనీ కోసం యువత పెడదారి పడుతున్నారు..బెట్టింగ్ ముఠాలపై ఏపీ పోలీసులు ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్న ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు మాత్రం ఆగడం లేదు..ఇప్పటికే ఏపీలో బెట్టింగ్‌పై నిషేధం ఉన్నప్పటికి కింత నేతలు గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌ దందాలను నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version