క్రికెట్‌ అభిమానులకు తీపికబురు.. మల్టీప్లెక్స్‌ల్లో టీ20 వరల్డ్ కప్​ మ్యాచ్​ల లైవ్..

-

క్రికెట్ ఫ్యాన్స్ కు తీపికబురు చెప్పింది ఐనాక్స్‌ సంస్థ. ఇప్పటి వరకు మొబైల్, టీవీ స్క్రీన్లకే పరిమితమైన క్రికెట్ మ్యాచ్​లను భారీ తెరలపై చూసే అవకాశం కల్పించనుంది ఐనాక్స్ సంస్థ. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐనాక్స్ లీజర్ ఒక ప్రకటనలో తెలిపింది. టీమ్ ఇండియా ఆడబోయే అన్ని గ్రూప్ మ్యాచ్‌లను ఐనాక్స్ ప్రదర్శిస్తుంది, అక్టోబరు 23న దాయాది పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ నుంచే ఐనాక్స్ స్ట్రీమింగ్ ప్రారంభిస్తుంది. ఈ లైవ్ మ్యాచ్స్ 25 కంటే ఎక్కువ నగరాల్లో ఉన్న ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లలో ప్రసారం కానున్నాయి. దేశవ్యాప్తంగా 74 నగరాల్లో ఐనాక్స్కు 165 మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. అవి 705 స్క్రీన్‌లతో 1.57 లక్షల సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద మల్టీఫెక్స్ చైన్ ను ఈ ఏడాది మార్చిలో పీవీఆర్ సంస్థతో కలిసి ఏర్పాటు చేసింది ఐనాక్స్.

ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ యొక్క ఎనిమిదవ ఎడిషన్ అక్టోబర్ 16 నుండి ప్రారంభంకానుంది. సూపర్ 12 దశ అక్టోబర్ 22 న మెుదలవుతుంది. ఫైనల్ నవంబర్ 13న మెల్బోర్న్‌లో జరుగనుంది. వరల్ట్ కప్ ప్రారంభానికి ముందు భారత యువ జట్టు అదిరిపోయే ప్రదర్శన చేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ లో భారత్ బౌలర్ల ధాటికి సఫారి జట్టు 99 పరుగులకే కుప్పకూలింది. కులదీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. శుభమన్ గిల్ 49 పరుగులతో రాణించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version