ఆంధ్ర రాష్ట్రంలో నేరాల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణకు కృష్ణా జిల్లా పోలీసుల పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గుడివాడ పరిధిలో ఇంజినీరింగ్ కాలేజీ వెనుక బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించారు.
డ్రోన్ కెమెరాను చూడగానే సదరు యువకులు అక్కడ నుంచి పరుగులు తీయగా.. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇక మీదట రాష్ట్రంలో బహిరంగ మద్యం, వేధింపులు వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రోన్ నిఘా ద్వారా నేరాలను అదుపు చేయొచ్చని పోలీసులు భావిస్తున్నారు.