కడప నగరంలోని రామి రెడ్డి ఫార్మసీ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
హాస్టల్ లో చేరిన నాలుగు రోజుల్లోనే బలవన్మరానికి పాల్పడ్డ ఫిజియథెరపీ మొదటి సంవత్సర విద్యార్థిని సుజాత మృతిపై తల్లిదండ్రులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
కాలేజీ హాస్టల్ లోని తన గదిలో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కళాశాల నుండి తల్లిదండ్రులకు ఫోన్ చేశారని, ఉన్న పళంగా కారణం లేకుండా ఎలా ఆత్మహత్య చేసుకుందని విద్యార్థీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.విద్యార్థిని సొంత గ్రామం పోరుమామిళ్ళ మండలం నాగల కుంట్ల. మృతదేహాన్ని విద్యార్థి సంఘాల నాయకులు పరిశీలించారు. మృతి వెనుక ఉన్న అనుమానాలను నివృత్తి చేసేలా విచారణ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.