హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ప్రేమించిన అమ్మాయి పెళ్లికి దూరం అవుతుందన్న బెంగతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓల్డ్ సిటీలోని కలాపట్టర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, మహ్మద్ తబ్రేజ్ అలీ, స్థానికంగా ఉండే అమ్మాయితో ప్రేమయాణం నడిపిస్తున్నాడు.
అయితే, ఇద్దరి ఇళ్లలో పెళ్లికి ఒప్పుకున్నారు. అనంతరం కొన్ని రోజులకు రెండు కుటుంబాల మధ్య తలెత్తిన విభేదాల కారణంతో ప్రేమ పెళ్లిలో బ్రేక్ పడింది. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య రిలేషన్ నడుస్తూనే ఉంది. అకస్మాత్తుగా ఇద్దరు వీడియో కాల్ మాట్లాడుకుంటూనే బాధితుడు లైవ్ లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.