గాలిపటం దారం గొంతు కోయడంతో వ్యక్తి మృతి…!

-

గాలిపటాలు ఎగరవేయడం సంక్రాంతి పండుగ లో ఉండే సాంప్రదాయాల్లో ఒకటి. అయితే కొన్నేళ్ళ నుండి గాలి పటాలు ఎగరేయడానికి ఉపయోగించే దారాల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఎక్కువగా చైనా మాన్జా ను గాలిపటాలు ఎగరవేయడం కోసం వాడుతున్నారు. ఈ దారం వల్లే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ దారం కాళ్ళకు తగలడం వల్ల పక్షులు గాయపడుతున్నాయు.

అదే విధంగా జంతువులు సైతం ఈ మాంజ ను మింగి మరణిస్తున్నాయి. ఇక తాజాగా మాంజ వల్ల ఓ వ్యక్తి ప్రాణం పోయింది. వివరాల్లోకి వెళితే… మంచిర్యాల జిల్లా కేంద్రంలో పండుగ పూట విషాదం నెలకొంది. మంచిర్యాల నుండి ఓ వ్యక్తి తన భార్య తో కలిసి లక్షటిపేట వైపు వెళ్తుండగా గాలి పటం దారం మెడకు తగిలింది. ఒక్కసారి గా మెడకు తగిలిన దారం ఏకంగా ఆ వ్యక్తి గొంతును కోసింది. దాంతో కిందపడిపోయిన వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version