కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్ల మీద ఉమ్మి వేయడంపై కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. రోడ్డు మీద ఉమ్ము వేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం అని భారీ జరిమానా విధిస్తాం అని ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తరుణంలో గుట్కా నమలవద్దు అన్నందుకు ఒక వ్యక్తి కత్తితో నరికేసాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన ఆందోళన కలిగించింది.
ఆ రాష్ట్రంలోని సీతాపూర్‌లో ఒక యువకుడు తన మిత్రుడి తో కలిసి… గుట్కా నములుతూ ఇంటి పై నుంచి కిందకు ఉమ్ము ఊసాడు. దీనితో అక్కడే కింద లాన్ లో భార్య సుధా తో కలిసి రాజేష్ మిశ్రా అనే వ్యక్తి కబుర్లు చెప్పుకుంటున్నాడు. దీనితో అది వచ్చి అతని మీద పడింది. ఆగ్రహించిన రాజేష్… ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేయవద్దు అని హెచ్చరించాడు.
క్షమాపణ చెప్పకుండా దాడికి దిగాడు ఆ వ్యక్తి. సదరు వ్యక్తి వారిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారు అయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు నిందితులను గోలు, కల్లుగా పోలీసులు గుర్తించి వారిపై కేసు నమోదు చేసారు. ఈ ఘటనలో భార్యా భర్తలు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.