కొడుకు కళ్ళేదుటే దారుణం .. 79 రోజులు నరకం..

-

ప్రస్తుతం క్రైమ్ రేటు రోజు రోజుకూ పెరుగుతోంది. మహిళల పై మాత్రం ఇంటా, బయట దాడులు జరుగుతూనే ఉన్నాయి. కామంధుల ఎటువంటి కఠిన శిక్షలు అమలు చేసిన కూడా సమాజంలో పెద్దగా మార్పులు రావడం లేదు. దేశ వ్యాప్తంగా అత్యాచారాలు, హత్యలు మహిళల పై జరుగుతున్నాయి. మరీ! దారుణమైన ఘటన ఇప్పుడు వెలుగు చూసింది. కన్న కొడుకు ముందరే తల్లి పై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకరోజు రెండు రోజులు కాదు ఏకంగా దాదాపు 80 రోజుల నరకాన్ని చూపించారు..పాపం వీళ్ళు అసలు మనుషులు కాదు..దారుణం..

ఈ దారుణ ఘటన..ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ తాంత్రికుడు వివాహితపై తన రెండున్నరేళ్ల కుమారుడి ఎదుట 79 రోజుల పాటు చాలాసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. 5 ఏళ్ళ కిందట ఆమెకు వివాహం జరిగింది. కట్నం కోసం అత్తమామలు శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. తనతో కొన్ని నెలల పాటు ఉంటే విభేదాలను పరిష్కరిస్తానని తాంత్రికుడు ఆ కుటుంబానికి హామీ ఇచ్చాడు.

అత్తామామలు తనని బలవంతంగా మత్తు ఇచ్చి తాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లారని మహిళ చెబుతోంది. తనతో పాటు తన కుమారుడిని కూడా పంపించారని పేర్కొంది. తాంత్రికుడు తన కొడుకు ముందే తనను 79 రోజుల పాటు బలవంతంగా అత్యాచారం చేశాడని మహిళ పోలీసులకు తెలిపింది. శుక్రవారం నాడు తాంత్రికుడు సెల్ ఫోన్ మర్చిపోయి వెళ్లడంతో మహిళ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరిస్థితి గురించి చెప్పి, బోరుమంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ భర్త, మరిది, అత్తమామలపై కేసు నమోదు చేశారు. కానీ, తాంత్రికుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం వెతుకుతున్నామని చెప్పారు.ఈ దారుణ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version