ఏపీలోని తాడేపల్లిలో ఓ విశ్వవిద్యాలయంలో బీబీఏ చదువుతున్న విద్యార్థి(20) విద్యార్థికి ఓ రోజు అపరిచిత మహిళ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. నెమ్మదిగా ఆమె యువకుడితో పరిచయం పెంచుకుంది. మాయమాటలతో అతడిని లోబర్చుకుంది. కొన్నిరోజుల తర్వాత వారి పరిచయం శ్రుతిమించింది. నగ్న వీడియోలు తీసి పంపాలని ఆ యువకుడికి కోరింది ఆ కిలేడి. ఆమె చెప్పినట్టుగానే అతడు పంపాడు.
వీడియోలు చేతికి చిక్కాక కిలేడీ అసలు రూపం బయటపెట్టింది. ఆ యువకుడిని బ్లాక్ మెయిల్ చేసింది. తను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే న్యూడ్ వీడియోలు బయటపెడతానని బెదిరించింది. ఆమె బెదిరింపులకు భయపడ్డ యువకుడు పరువు పోతుందని ఆమెకూ రూ.8వేలు పంపాడు. ఇంకా డబ్బు కావాలని బెదిరిస్తుండటంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇలా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ నమ్మొద్దని పోలీసులు సూచించారు. సైబర్ కిలేడీల చేతిలో ఎంతో మంది విద్యార్థులు మోసపోతున్నారని తెలిపారు. న్యూడ్ వీడియోలు పంపాలని, నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడమని అపరిచిత వ్యక్తులు అడిగినప్పుడు సందేహించి వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.