తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటలు ఏం వేయాలనే ప్రణాళిక సిద్ధమవుతోంది. అందుకు తగ్గట్టుగానే అధికారులు నివేదిక సిద్ధం చేశారు. నేడు యాసంగి పంటలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేయనున్నారు. దీని ఆధారంగానే రైతులు యాసంగి సాగు చేయనున్నారు. గతంలో కూడా ఇలాగే రాష్ట్రం పంటల సాగు ప్లాన్ ను సిద్ధం చేసింది. గతంలో సన్నరకాల బియ్యం సాగు
గు చేయాలని, పత్తిని పండించాలని సూచించారు. మొక్కజొన్న పంట సాగును నిలిపివేయాలని సూచించారు. ప్రస్తుతం కూడ ఇదేవిధంగా పంటల ప్రణాళికలను సిద్ధం చేయనున్నారు. రాష్ట్రంలో డిమాండ్ కు మించి దొడ్డురకం వడ్లు, మొక్కజొన్నను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం దొడ్డువడ్లను కొనుగోలు చేయనని చెబుతోంది. ఈ సాగు నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించేందుకు యాసంగి ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో సాగు ప్రణాళికపై సీఎం సమీక్ష చేసి, రైతులు ఏ పంటలు వేయాలో సూచించనున్నారు.