రేపటి నుండి డ్రైవింగ్ లైసెన్స్ సహా పలు కీలక నిబంధనల్లో మార్పులు

-

రేపటి నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ మొదలు ఆరోగ్య బీమా వరకూ పలు నూతన నిబంధనలు అమలవనున్నాయి. రేపటి నుడి టీవీల ధరలు  పెరగడంతో పాటు, విదేశాలకు పంపే నగదుపై అదనపు పన్ను కూడా పడనుంది. నూతన నిబంధనల ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్సు పొందడం సులభతరం కానుంది. గురువారం నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, “ఈ-చలాన్‌”ను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పొందుపరచాల్సి ఉంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు పరిమిత డాక్యుమెంట్లు సరిపోతాయు. హార్డ్‌ కాపీని అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అనర్హతకు గురైన డ్రైవింగ్‌ లైసెన్సులు, పునరుద్ధరించిన లైసెన్సుల వివరాలను “ఈ పోర్టల్‌”లో ఎప్పటికప్పుడు అప్ డేట్ కానున్నాయి. “ఆరోగ్య బీమా” రంగంలో మూడు కీలక మార్పులను చేపట్టినట్టు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ వెల్లడించారు.

వినియోగదారులు సులభంగా అర్ధం చేసుకునేలా బీమా కంపెనీలు పాలసీలను రూపొందించడంతో పాటు టెలిమెడిసిన్‌కూ బీమా కవరేజ్‌ వర్తింప చేయనున్నారు. బీమా క్లెయిమ్‌ లను సులభంగా బీమా కంపెనీలు పరిష్కరించనున్నారు. అక్టోబర్‌ 1 నుంచి టీవీల దిగుమతులపై 5 శాతం కస్టమ్‌ సుంకాలను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచనుంది. నిర్ణయంతో 32 అంగుళాల టీవీ రూ 600, 42 అంగుళాల టీవీల ధరలు రూ 1200 నుంచి రూ 1500 వరకూ పెరగనుంది. విదేశాల్లో చదువుకునే పిల్లలకు తల్లితండ్రులు పంపే నగదు, బంధువులకు సాయం చేస్తూ పంపే మొత్తాలపై అదనంగా 5 శాతం పన్ను (టీసీఎస్‌) వేయనున్నారు. ఆర్‌బీఐ రెమిటెన్స్‌ పథకం కింద విదేశాలకు పంపే మొత్తాలపై టీసీఎస్‌ చెల్లించాలని “ఫైనాన్స్‌ చట్టం, 2020” లో పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version