అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని బడన్నపల్లి పొలాల్లో శవం అయి తేలిన బ్యాంక్ ఉద్యోగిని స్నేహలత కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్నేహలత హాకీ ప్లేయర్. అనంతపురంలోని అశోక్ నగర్ కు చెందిన డిగ్రీ చదువుతున్న సమయంలో సెట్రింగ్ పని చేసే రాజేష్ అనే యువకుడు వెంటపడి వేధించే వాడు. ఇంతలో రాజేష్ కు తోడుగా కార్తీక్ అనే వ్యక్తి కూడా తోడయ్యాడు. వీరి వేధింపులపై స్నేహలత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. వారి వేధింపుల కారణంగా చదువు, హాకీ మానేసింది. ఇటీవలే ధర్మవరం స్టేట్ బ్యాంక్ లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరింది.
ప్రతి రోజు టూవీలర్ లో బ్యాంక్ కి వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో మొన్న బ్యాంక్ కు అని ఇంటి నుంచి వెళ్లింది. సాయంత్రం ఎంతకీ తిరిగి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు అనుమానం ఉన్న రాజేష్, కార్తీక్ పేర్లు చెప్పారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజేష్ , కార్తీక్ స్నేహలతను హత్య చేసినట్లు తెలుస్తోంది. రాజేష్ తో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతో పాటు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉందనే అక్కసుతో బ్యాంక్ నుంచి తిరిగి వస్తున్న స్నేహలతను దారి మధ్యలో పొలాల వద్ద కాపు కాసి హత్య చేసినట్లు చేసినట్లు భావిస్తున్నారు. అయితే అత్యాచారం చేసి చంపారా లేదా అన్నది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలియాల్సి ఉంది. హత్య చేసిన తరువాత శరీరం కింది భాగంలో పెట్రోల్ పోసి తగులబెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.