కరోనా వైరస్ మహమ్మారి… దాని ఫలితంగా విధించిన లాక్డౌన్ సీనియర్ సిటిజన్ లపై తీవ్ర ప్రభావం చూపించింది అని ఒక సర్వే వెల్లడించింది. ముగ్గురు వ్రుద్దులలో ఒకరికి ఈ వ్యాధి భయం చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. 29% మంది ఆంక్షలు కారణంగా సామాజిక ఒంటరితనం అనుభవించారు అని సర్వే గుర్తించింది. భారత్ లో చాలా మంది వృద్దులు ఈ సర్వే కారణంగా ప్రభావితం అయ్యారని సర్వే వెల్లడించింది.
20.3% మందికి పైగా మహమ్మారి గురించి ఎక్కువగా ఆందోళన చెందారని పేర్కొన్నారు. సర్వే చేసిన వారిలో సగం మంది ప్రభుత్వ మహమ్మారి ప్రతిస్పందనను మెచ్చుకున్నారు. భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా అంతరాయాలు ఏర్పడినప్పటికీ, భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను 55% మంది సీనియర్లు ప్రశంసించారు. 24% మంది సీనియర్లు ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆరోగ్య సంరక్షణ సంక్షోభాన్ని నిర్వహించడంలో భారతదేశం విఫలమైందని పేర్కొన్నారు. 80% మంది సీనియర్లు స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడ్డారు. 77% మంది సీనియర్లు తమ సొంత లేదా అద్దె ఇళ్లలో స్వతంత్రంగా నివసిస్తున్నారని సర్వేలో తేలింది. 16% మంది సీనియర్లు మాత్రమే తమ పిల్లలు లేదా మనవరాళ్లతో నివసించారని చెప్పారు.