మంచిగా రాబడి వస్తుంది కాబట్టి చాలా మంది రైతులు అత్యంత నాణ్యమైన కలపని ఇచ్చే టేకు మొక్కలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టేకు మొక్కల సాగు చేయొచ్చు.
అయితే టేకు మొక్కలు సాగు చేయడానికి ఎర్రనేల, ఒండ్రు నేలలు బాగా నాణ్యమైనవి అని చెప్పొచ్చు. అయితే టేకు మొక్కలు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?, ఏ విధంగా అనుసరిస్తే మంచిగా దిగుబడి వస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం.
టేకు మొక్కలను సాగు చేయడానికి నీటి ముంపు ప్రదేశాలు అస్సలు అనుకూలం కావు. టేకు మొక్కలుని విత్తనాలు లేదా పిలకల నుంచి పునరుత్పత్తి చేయొచ్చు. టిష్యూ కల్చర్ మొక్కల ద్వారా కృత్రిమ పునరుత్పత్తి కూడా చేయొచ్చు. టేకు విత్తనాల్లో మొలక శాతం తక్కువగా ఉంటుంది.
కనుక టేకు విత్తనాలకు వివిధ రకాల సీడ్ ట్రీట్మెంట్ చేస్తే మొలక శాతం పెరుగుతుంది. విత్తనాలను వేడి నీటిలో 2-3 గంటల వరకు ఉంచి చల్లారాక విత్తుకుంటే మంచిది. లేదు అంటే మరో పద్దతి వుంది. అదేమిటంటే విత్తనాలను ఒక గోనె సంచిలో వేసి గుంతలో పూడ్చి 10 రోజుల వరకు ప్రతిరోజు నీరు పోసి ఆ తర్వాత నారుమడిలో విత్తుకోవాలి. ఇలా చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.