దిల్లీ లిక్కర్ స్కామ్.. ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు కస్టడీ పొడిగింపు

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కామ్​లో ఈడీ, సీబీఐలు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 8న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును కూడా అరెస్టు చేశారు. దిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని.. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయన్ను సీబీఐ అరెస్టు చేసింది.  న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యూడిషియల్‌ కస్టడీ విధించింది. ఆ గడువు ఈ రోజుతో ముగిసింది.

ఈ నేపథ్యంలో బుచ్చిబాబును సీబీఐ అధికారులు మరోసారి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇంకాస్త లోతుగా దర్యాప్తు చేయాలని.. అందుకు బుచ్చిబాబును మరింత విచారించాల్సింది ఉందని కోర్టుకు వివరించారు. మరో 14 రోజులు బుచ్చిబాబు కస్టడీ పొడిగించాలని కోరింది. అధికారుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు బుచ్చిబాబు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 9కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version